జగన్‌పై చిరంజీవి కామెంట్స్ - స్ఫూర్తిదాయక నాయకత్వమంటూ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్‌ది స్ఫూర్తిదాయక నాయకత్వం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఈ వైద్య సిబ్బంది ఈ ఘనత సాధించారు.
దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఓ గొప్ప కార్యం.. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కొవిడ్ భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. జగన్ గారిది స్ఫూర్తిదాయక నాయకత్వం.. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.