మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (16:51 IST)

సీఎం జగన్‌కు ఆర్ఆర్ఆర్ లేఖాస్త్రాలు.. శాసనమండలి రద్దుకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఇందులో ఏపీ శాసనమండలిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 
 
సభలో మెజార్టీ ఉన్నపుడే మండలిని రద్దు చేస్తే మన చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. 
 
మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్‌ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని కోరారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానన్నారు. జగన్‌ విలాసాలకు 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని, వీటిపై నిజానిజాలను బహిర్గతం చేయాలని రఘురామ లేఖలో వంగ్యాస్త్రాలు సంధించారు.