సంబంధిత వార్తలు
- సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లు చట్ట విరుద్ధం : ఏపీ సర్కారు హైకోర్టు షాక్
- ఏపీ జాబ్ క్యాలెండర్ : విడుదల చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
- ఏపీ శాసన మండలిలో మారిన సమీకరణాలు : ఆధిక్యంలో వైకాపా
- ఏపీ శాసనమండలిలో టీడీపీకి తగ్గి వైకాపాకు పెరిగిన బలం
- జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు కాదు.. ఏడు పేపర్లే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూలో సడలింపులు.. సాయంత్రం 6 వరకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో వున్న కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, సాయంత్రం 6 గంటలకు అనేక సండలింపులు ఇవ్వాలని భావిస్తోంది.
శుక్రవారం కొవిడ్‌పై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ సండలింపులు జూన్ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ ఖచ్చితంగా అమలవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది.
కొవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.
తర్వాతి కథనం
