గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (15:35 IST)

స్ఫూర్తిదాయక నేత అంటూ చిరు ప్రశంసలు - ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఒకే రోజు ఏపీలో 13.72 లక్షల కరోనా వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వం వేసిన సందర్భంగా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ముఖ్యమంత్రి కృషి అందరిలో విశ్వాసాన్ని పెంచుతోందని ఆయన ప్రశంసించారు. జగన్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని చెప్పారు.
 
ఈ నేపథ్యంలో చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కృషికి మీరు ఇచ్చిన కితాబుకి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ క్రెడిట్ అంతా గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు చెందుతుందంటూ సీఎం జగన్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.