బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:12 IST)

కండోమ్ వాడింది, ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం గెలిచింది, ఎలా?

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
టోక్యో ఒలింపిక్ క్రీడల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఓ కోచ్ తన ప్లేయర్‌తో లైవ్‌లో మ్యారేజ్ ప్రపోజ్ చేశాడట. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడట. ఒక బాక్సర్ ప్రత్యర్థి చెవిని కొరికేశాడు. తాజాగా ఒక ప్లేయర్ కండోమ్ వాడి మెడల్ గెలిచిందన్న విషయం చర్చకు దారితీస్తోంది.
 
ఒలింపిక్ క్రీడల్లో కండోమ్స్ ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి టోక్యో వచ్చిన అథ్లెట్స్‌కు కండోమ్స్ ఉచితంగా ఇచ్చారట. కండోమ్ ఇచ్చినంత మాత్రాన శృంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ జరపవద్దని నిర్వాహకులు చెబుతుంటారు. 
 
కానీ ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ మాత్రం కండోమ్‌ను ఉపయోగించి ఏకంగా పతకమే కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన గయాకింగ్ ప్లేయర్ జస్సికా ప్లాప్ ప్రయాణిస్తున్న బోట్ పాడైపోయింది. ఆమె క్రీడా ప్రదేశానికి చేరుకునేందుకు బోట్ ఎక్కగా దాని ముందు భాగం పాడైన విషయాన్ని గమనించింది. 
 
దీంతో ఏంచేయాలో పాలుపోలేదు. వెంటనే ఒక కార్బన్ పదార్థం లాంటి పిండిని కలిపి ముందు భాగానికి అతికించింది. నీటిలో అది కరిగిపోకుండా దానికి కండోమ్‌ను తొడిగిందట. జస్సికా తాను బోటును ఎలా రిపేర్ చేస్తుందో చూపిస్తూ వీడియోను పోస్ట్ చేశారట. ఆ వీడియోను చూసిన క్రీడాకారులు అవాక్కవుతున్నారట. జస్సికా చాకచక్యాన్ని మెచ్చుకున్నారట. అంతేకాదు ఈమె అలా చేయడంతో పతకాన్ని గెలవగలిగిందట.