గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (10:23 IST)

సోమవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు… సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్ ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.49,090కి చేరింది.
 
అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.44, 990 కు చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ 73,000 వద్ద ఉంది.
 
ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,430 గా ఉంది.
 
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,380 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,380 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,470 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,610 వద్ద కొనసాగుతోంది.
 
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,990 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,090 వద్ద కొనసాగుతోంది.