1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జులై 2025 (23:10 IST)

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఏఎం రత్నం నిర్మాత. గురువారం ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను గురువారం సాయంత్రం నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
 
సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు. క్యాబినేట్ మీటింగ్‌లో నా పంచాయితీ శాఖ గురించి మాట్లాడాతాను అనుకున్నాను. కానీ సినిమా పంచాయితీలు కూడా చేస్తాననుకొలేదు. నా జీవితంలో ఏది ఈజీగా లభించలేదు. గత రెండు రోజులుగా సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను.. సరైన నిద్రలేదు. భగవంతుడు నాకు నీ సినిమాను ప్రమోట్ చేసుకో అని అవకాశం ఇచ్చాడు. 
 
సినిమా జయాపజయాలను నేను తలకు ఎక్కించుకోను. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌లో గ్లిజ్డెస్ ఉండొచ్చు.. కానీ ఇది ఎమోషనల్‌‌గా ఎలా కనెక్ట్ అయిందనేది ముఖ్యం. మన చిన్నప్పుడు నుంచి చదివిన కథలు వేరు.. జరిగింది వేరు. జిజియా పన్ను గురించి నేను చిన్నప్పుడు చదువుకున్న విషయం ఈ సినిమా చేసెప్పుడు గుర్తొచ్చింది. ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా చేయాలనుకున్నప్పుడు. చరిత్రలో జరిగిన నాటి సంఘటనలను.  
 
చరిత్రలో అక్బర్ ది గ్రేట్ అంటాం కానీ.. కృష్ణదేవరాయులు జై, రాణీ రుద్రమదేవి కి జై అనం. ఇంతా చేసి మొఘలలు పరిపాలించింది రెండొదళ్ల ఏళ్లే. చరిత్ర అలా రాసేశారు. ఔరంగజేబు గురించి మాట్లాడితే సెన్సిటివ్ మ్యాటర్‌‍లా చూస్తారు. కానీ ఎంతోమందిని చంపాడు.. ఇబ్బంది పెట్టాడు. అందుకే ఔరంగజేబు డార్కర్ సైడ్‌‍ను చూపించాలని ఈ కధలో ఎక్స్ ప్యాండ్ చేశాము. వారు దుర్మార్గం కూడా చెప్పాలని క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో వివరంగా చూపాం.
 
ఇదంతా గుడ్ వర్సెస్ బ్యాడ్ మాత్రమే కానీ.. కమ్యూనల్ డిఫరెన్స్‌లకు సంబందించింది కాదు. పార్ట్ 2 కూడా 20 నుంచి 30 శాతం కంప్లీట్ చేశాం. ఇక రత్నంకు అండంగా మైత్రీ రవి, నవీన్, పీపుల్ మీడియా విశ్వప్రసాద్ నిలిచారు. వారికి ధన్యవాదాలు. ఈ సినిమాను కొందరు బాయ్ క్యాట్ చేస్తాం అంటున్నారు..‌ ఎస్ చేయండి.
 
నేను పెద్ద స్దాయికి ఎదిగాను.. మిమల్ని బయపట్టే స్థాయికి ఎదిగాను అనుకుంటాను. ఎవడికి బేదిరేది లేదు. నా అభిమానుల బలం వల్లే ఇదంతా. నాకు డిప్రెషన్ ఉండదు.. ‌ధైర్యం మాత్రమే ఉంటుంది. మన సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే మనం బలంగా ఉన్నామని మా టీమ్‌కు చెప్పాను. మొఘలలు చేసిన మంచె కాదు.. చెడు గురించి మాట్లాడంది. కేవలం పాజిటివ్ సైడ్‌నే నూరిపోశారు‌. 
 
నేను సినిమాలో అన్నింటిని అడ్రెస్ చేయటం బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్. నేను కలెక్షన్స్ దగ్గర ఆగిపోను.‌ సినిమా అనేది ఇంపాక్ట్ .. ఎలా అది మనతో కనెక్ట్ అవుతుందనేది ఇంపార్టెంట్. హరిహర వీరమల్లు అది రీచ్ అయింది. హరిహర వీరమల్లు‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. పార్ట్ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. అభిమానులు సెన్సిటివ్‌గా ఉండకండి.. హ్యాపీగా మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఈ సినిమా నాదో రత్నం గారిదో మాత్రమే కాదు.. ఇది మన దేశ చరిత్రకు సంబంధించింది.
 
కోహినూర్ పగిలినా ఫర్లేదు.. మన దేశ సాంస్కృతిక సంపద వారసత్వం కొనసాగటం అవసరం. ఇలాంటి ఒక సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. నేను 2019 ఓడిపొయినపుడు నేనంత అవమానపడతానో అనుకున్నారు. కానీ నేను చిన్న స్థాయి నుంచి హీరో అయి పార్టీ పెట్టి ఈ స్దాయికి రావటమే గొప్ప విజయం. నేను జీవితాన్ని కాదు మానవత్వాన్ని, బంధాలను సీరియస్‌‍గా తీసుకుంటాను. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి అని పవన్ చెప్పుకొచ్చారు.