యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్
UK pawan fans celebrations
హరి హర వీర మల్లు సినిమా విడుదలను యునైటెడ్ కింగ్‌డమ్‌లో జనసేన సావే కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్, బర్మింగ్‌హామ్, స్కాట్లాండ్, కోవెంట్రీ తదితర నగరాల్లో అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ గెటప్‌లో అలరించిన ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా UK జనసేన సావే విభాగం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం విశేషం.
సినిమా ప్రారంభానికి ముందు ఆటా పాటలతో సందడి చేసి పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని ఘనంగా చాటారు. విదేశాల్లోనూ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ సెలబ్రేషన్లు మరోసారి రుజువు చేశాయి. హరి హర వీర మల్లు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది.
ఈ వేడుకలకు యూకే లోని నా సేన కోసం నా వంతు సభ్యుడు చంద్ర సిద్దం ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు. లండన్ నుండి మ్యాంచెస్టర్, బర్మింగ్‌హామ్ నుండి స్కాట్లాండ్ వరకు జనసైనికులు పవన్ కల్యాణ్ గారి పట్ల ఉన్న అభిమానాన్ని, పౌరుశాన్ని కలుపుకుని ఈ చారిత్రాత్మక చిత్రం విడుదలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇది కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదు – ఇది ఐక్యతకు, ఆలోచనలకు, జనసేన భావజాలానికి ప్రతీకగా నిలిచే వేడుక అని చంద్ర సిద్దం తెలిపారు. వీర మల్లు శక్తి ప్రతి ప్రవాస భారతీయుడికి న్యాయం, సంస్కృతి, ధైర్యం పట్ల నిలబడే ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నాము అన్నారు.
లండన్ లో సభ్యులు చంద్ర సిద్దం, శంకర్ సిద్దం, శివ మేక, మనోజ్ మంత్రాల, శివ రామిశెట్టి, చలపతి నాయుడు డాడీ, సాయి గండం, అమలా చలమలశెట్టి, నాగరాజు వద్రానం, అఖిల్ పెండ్యాల, పద్మజ రామిశెట్టి, వంశీ మైలవరపు పలువురు పాల్గొన్నారు. యూకే లో ఇతర నగరాలైన బర్మింగ్‌హామ్ నుంచి హేమరాజ్ గెల్లి, అచ్యుతరాజు కూర్మపు, సందీప్ రెడ్డి, కోటేష్ లు పాల్గొన్నారు. స్కాట్లాండ్ నుంచి బడే సురేంద్ర, తేజేష్ లు కోవెంట్రీ నుంచి పవన్ కళ్యాణ్, అజయ్ పాల్గొన్నారు.