మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జులై 2025 (11:05 IST)

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

Air Hostess
Air Hostess
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోరం జరిగింది. తన సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, మీరా రోడ్‌ ప్రాంతంలో వేర్వేరుగా నివసిస్తున్న వీరిద్దరూ ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో కలసి విధులు నిర్వహించారు. 
 
మళ్లీ ముంబైకు తిరిగివచ్చిన వీరిద్దరు ఒకే వాహనంలో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, ఈ క్రమంలో పైలట్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి పైలట్‌ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.