శుక్రవారం, 25 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 24 జులై 2025 (17:12 IST)

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

Pawan, chandrababu
Pawan, chandrababu
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నహరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేశారు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
 
కాగా, ఈరోజే విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో మరోసారి చంద్రబాబు విషెస్ చెబుతూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రలో సినిమా టికెట్ల రేట్లకు తనకు మంచి సపోర్ట్ గా నిలిచిన చంద్రబాబుకు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక రోజు పవన్ కళ్యాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలోనే తెలుగుదేశం యువనేత మంత్రి నారా లోకేష్ కూడా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమా విజయవంతం కావాలని నారా లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు పవన్.