Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్
హరి హర వీర మల్లు జూలై 24న విడుదల కానుంది. ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఈ చిత్రంపై తన అభిప్రాయాలను, చిత్ర హీరో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు.
"హరి హర వీర మల్లు విడుదల సందర్భంగా, ఈ చిత్రానికి పనిచేసిన మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను. పవర్ స్టార్ అభిమానులందరిలాగే, నేను కూడా ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు పవనన్న, అతని సినిమాలు ఇష్టం. అతని స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ స్టార్ సూపర్ నటనతో, హరి హర వీర మల్లు భారీ విజయం సాధించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను." అని నారా లోకేష్ అన్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నారా లోకేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇద్దరూ దానిని రీ-ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి విడుదల కావడంతో సోషల్ మీడియా చాలా ఉత్సాహంగా ఉంది. అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యమైనప్పటికీ, ఈ సినిమా జూలై 24వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.