విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ
Santosh Shobhan, Falguni Khanna
క్రేజీ యువ కధానాయకుడు సంతోష్ శోభన్, అందాల భామ ,ఫల్గుణి ఖన్నా జంటగా జి .సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం "జోరుగా హుషారుగా షికారు పోదమ ". తొలికాపీతో సహా అన్ని కార్యక్రమాలనుపూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైందని త్రిపుర క్రియేషన్స్ అధినేత చిత్రం ,వరల్డ్ నెగటివ్ హక్కుదారుడు మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, "ఇది మధురమైన రొమాంటిక్ కామెడీగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే...లైట్ హార్టెడ్ ట్రావెల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకుంటుంది. ఇండియా మొత్తం చుట్టి వచ్చినట్టుగా ఉంటుంది.. సంతోష్ శోభన్ కు కెరీర్ పరంగా మరింత మంచి పేరు తెచ్చిపెడుతుంది. కనువిందు చేసే సినిమాటోగ్రఫీ, వీనులవిందైన సంగీతం చిత్రానికి ఓ ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
.ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీ, సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్