సోమవారం, 17 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (17:03 IST)

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

Santosh Shobhan, Manasa Varanasi and team
Santosh Shobhan, Manasa Varanasi and team
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా తెరకెక్కుతున్న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
 
టైటిల్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా వీడియో గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా ఆడియెన్స్ కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తెలుగు తమిళ ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ తీసుకుంది. త్వరలోనే "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.