బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (16:38 IST)

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

Manasa Varanasi
Manasa Varanasi
ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఛాలెంజ్ గానే వుంటుంది. సెట్స్ లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సినిమా లాంగ్వేజ్ వీటన్నిటినీ అన్ స్పాట్ నేర్చుకోవాలి. స్పాంటేనియస్ గా ఉండాలి. అలాగే సత్య భామ పల్లెటూరి అమ్మాయి. ఆ బాడీ లాంగ్వెజ్, స్లాంగ్ ని వోన్ చేసుకోవడం కూడా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్. నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నానని దేవకి నందన వాసుదేవ హీరోయిన్ మానస వారణాసి తెలిపారు.
 
అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
-నేను హైదరాబాదులోనే పుట్టాను. టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్నాను. హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్లో జాబ్ చేశాను. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా ని రిప్రజెంట్ చేశాను. తర్వాత జాబ్ చేసుకోవాలా? ఈ అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా? అని అలోచిస్తున్నుపుడు మూవీ వర్క్ షాప్స్ కి వెళ్లాను. అక్కడ సినిమా మీద పాషన్ పుట్టింది. అక్కడే యాక్టింగ్ పై కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని అడిషన్స్ ఇచ్చాను. సినిమా గురించి నేర్చుకుంటున్నాను. ఇది నాకు కొత్త ప్రపంచం.
 
-నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. ఈ సినిమా విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సత్యభామ వెరీ ప్లే ఫుల్, లవ్ బుల్, మిస్టీరియస్ గర్ల్. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి. ఇది పర్సనల్ గా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. కథలో నా పాత్ర వెరీ స్ట్రాంగ్ గా వుంటుంది. కథలో నాది వెరీ కీ రోల్.  
 
-అశోక్ వెరీ ప్రొఫెషనల్. సినిమా అంటే చాలా పాషన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. సెట్స్ లో చాలా విషయాల్ని షేర్ చేసుకునేవారు. మహేష్ గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విషయాలు చెప్పేవారు. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.  
 
-ఈ కథ విన్న వెంటనే నా మైండ్ బ్లో అయింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఒక డెబ్యు యాక్టర్ కి ఇలాంటి కథ, క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
 
-రోమాన్స్. కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ నా ఫేవరేట్ జోనర్స్. కథ బావుంటే ఏ జోనర్ సినిమా చేయడానికైన సిద్ధమే.
 
-మహేష్ బాబు గారు , పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున.. ఇలా అందరి సినిమాలుని చూసేదాన్ని. గత నాలుగేళ్ళుగా ఇంకా ఎక్కువ సినిమాలు చూస్తున్నాను.  
-యువీ క్రియేషన్లో తెలుగు, తమిళ్ లో 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా చేస్తున్నాను.