శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (15:37 IST)

అశోక్ గల్లా, వారణాసి మానస కెమిస్ట్రీ తో మాస్ డ్యాన్సింగ్ నెంబర్

Ashok Galla, Varanasi Manasa
Ashok Galla, Varanasi Manasa
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.  
 
ఇప్పటికే రిలీజైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ 'బంగారం' సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్  భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని మాస్  డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. సింహా, ఉమా నేహా ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
 
ఈ సాంగ్ లో అశోక్ గల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. అశోక్ గల్లా, వారణాసి మానస కెమిస్ట్రీ సూపర్బ్ గా వుంది.  వైబ్రెంట్ సెట్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి.  
 
డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌.
 
దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.