శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (16:05 IST)

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

Boyapati Srinu, Ashok Galla, Arjun Jandhyala, Prashanth Verma, Manasa Varanasi
Boyapati Srinu, Ashok Galla, Arjun Jandhyala, Prashanth Verma, Manasa Varanasi
అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్  ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
అనంతరం బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఐదేళ్ళు ఏకాగ్రత తో పని చేస్తే దేశం మొత్తం గర్వించదగ్గ ఇండస్ట్రీ లిస్ట్ అవ్వగల స్థాయిలో వున్న అశోక్, ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైనటువంటి సినీ ఫీల్డ్ ని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ఆదరించమని అడుగుతున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదించాలి. ఇండస్ట్రీలో నిజాయితీగా పనిచేస్తే ఎవరికైనా స్థానం ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. నిజాయితీగా పని చేస్తున్న అశోక్ గ్యారెంటీగా నిలబడతాడు. తప్పకుండా ఈ సినిమా పరిశ్రమ తనని నిలబడుతుంది. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల కి అశోక్ కి సింక్ చాలా బాగుంది. మొదటి సినిమా మనల్ని పరిచయం చేస్తుంది. రెండో సినిమా నువ్వేంటో చెబుతుంది. ఈ సినిమా ఈ ఇద్దరికీ అగ్నిపరీక్షే. ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొని గ్యారెంటీగా నిలబడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 100% మంచి సినిమా అని అనిపించింది.  థియేటర్స్ లో కూడా అదే రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మీ అందరినీ అలరించడానికి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ ఈవెంట్ కి రాలేకపోయారు. ఆయన ఈ వేడుకలో లేకపోయినా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు. ఆయన చెయ్యి ఎప్పుడూ నా భుజం మీద ఉంటుంది. అందులో డౌట్ లేదు. మా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు.
 
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ క్యారెక్టర్ కి అశోక్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా మంచి మేకోవర్  అయ్యారు . క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేశారు. తన డెడికేషన్  తనని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మానస చాలా సిన్సియర్ గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది తనకి మొదటి సినిమా. ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మా అందరి కంటే బాలా గారు ఈ సినిమాని ఎక్కువ నమ్మారు. ఆయన కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన మరికొందరికి అవకాశాలు ఇస్తారు. డైరెక్టర్ అర్జున్ చాలా మ్యాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు. అందరికీ ఆల్ ది బెస్ట్. 22 థియేటర్ కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి. ఆడియన్స్, సూపర్ స్టార్ మహేష్ గారి ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ లో చూడండి. సపోర్ట్ చేయండి. జై హనుమాన్. జైహింద్'అన్నారు.