శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (16:14 IST)

ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మురారి ఫీలింగ్ వచ్చింది : అశోక్ గల్లా

Ashok Galla
Ashok Galla
నాన్న గారు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్, పొలిటికల్ లీడర్ కూడా. కానీ నాకు చిన్నతనం నుంచి నటనపై ఇంట్రెస్ట్ ఎక్కువ. మహేష్ బాబు నాని సినిమాటైంలో చిన్నపాత్ర వేశాను. ఆ తర్వాత పుట్టిన ఆసక్తితో విదేశాల్లో చదువుతూ యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఇండియా వచ్చి నాన్నగారితో నేను నటుడ్ని అవుతానని చెప్పాను అని అశోక్ గల్లా తెలిపారు.
 
గల్లా జయదేవ్ కొడుకు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో ఈనెల 22న రాబోతున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించగా, ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నేడు అశోక్ గల్లా సినిమా విశేషాలని తెలియజేశారు. 
 
నిన్న మహేష్ బాబు గారిని కలిశారు కదా.. ఆ విశేషాలు చెప్పండి ?
 లైవ్ సెషన్ చేసాం. ఈ రోజు ఆయన సినిమా చూస్తున్నారు. ఆయన రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. సహజంగా సూచనలు కూడా పెద్దగా ఇవ్వరు. కష్టపడి పైకి రాావాలి అని మాత్రమే అంటుండేవారు.
 
ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథతో వచ్చారా?  డైరెక్షన్ తో వచ్చారా ?
ప్రశాంత్ గారు ఫస్ట్ నుంచి కథతోనే వచ్చారు. నా దగ్గర కథ, టీం వుంది వింటావా ? అని అడిగారు. కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ అర్జున్ గారు, నిర్మాత బాల గారు, ప్రశాంత్ గారి జర్నీ ముందు నుంచే వుంది.
 
అర్జున్ గారు కథలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి ?
-మెయిన్ గా సినిమా స్కేల్ బాగా పెరిగింది. అర్జున్ గారు ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా చేసి ప్రోపర్ కమర్షియల్ స్టయిల్ లో మేకింగ్ చేశారు. ప్రశాంత్ గారిటచ్ తో బోయపాటి గారు తీస్తే ఎలా వుంటుందో ఆ టైపులో వుంటుంది. యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వుంటుంది. అర్జున్ గారు, ప్రశాంత్ వర్మ కథని చాలా ఎలివేట్ చేశారు. ప్రశాంత్ వర్మ గారు అనుకున్న దానికంటే అవుట్ పుట్ బెటర్ గా వచ్చింది. సినిమా చూసి ప్రశాంత్ వర్మ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.  
 
ఇందులో డివైన్, మైథాలజీ ఎలిమెంట్స్ ఎలా వుంటాయి ?
-ఈ కథలో హను-మాన్ లా దేవుడ్ని చూపించం. ఇందులో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు..ఇలా మైథాలజీ మెటాఫర్ వుంటుంది.
 
-ఇందులో నా క్యారెక్టర్ రైజేషన్ చాలా ఎట్రాక్ట్ చేసింది. కథలో ట్విస్ట్ లు, ఎక్స్ ఫ్యాక్టర్ వుంటుంది. ట్రైలర్ లో కనిపించని చాలా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి. డివైన్ ఎలిమెంట్స్ ని అర్జున్ గారు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.    
 
ట్రైలర్ చూసినప్పుడు మురారిలా అనిపించింది ?
-ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మాకు మురారి ఫీలింగ్ వచ్చింది. ఆ టేకాఫ్ అలా వుంటుంది. కానీ మిగతా సినిమాలో మురారి షేడ్స్ కనిపించవు.
 
ఇది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కదా.. ఈ స్లాంగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
-కమర్షియల్ సినిమా కదా మరీ హెవీ స్లాంగ్ వద్దని డైరెక్టర్ అర్జున్ గారు చాలా కేర్ తీసుకున్నారు. చాలా గైడెన్స్ ఇచ్చారు. సాయి మాధవ్ బుర్రా గారు రాసిన విధానం కూడా చెప్పడానికి అంత కష్టంగా ఏమీ వుండదు. మనం చెప్పేలానే రాస్తారు. అది ఆయన క్రెడిట్. చాలా అద్భుతమైన మాటలు రాశారు.
 
లుక్ కొత్తగా వుంది. ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
-లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ప్రతి సినిమాకి డిఫరెంట్ గా కనిపించాలని నాకూ వుంటుంది. ఈ సినిమాకి రగ్గడ్ గా కనిపించాలని అన్నారు. దానికి తగ్గట్టు మేకోవర్ చేశాం. బాడీ గురించి కూడా చాలా వర్క్ అవుట్ చేశాను.  
 
ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ఏం అనిపించింది ?
-సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. కమర్షియల్ జోన్ లో సినిమా చాలా బావుంటుంది. ప్రేక్షకులు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ వర్మ గారి టచ్ వుండే ఎక్స్ ఫ్యాక్టర్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.