శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:55 IST)

కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి సంతోష్ శోభన్ గ్లింప్స్, టైటిల్ లుక్

Santhosh Shobhan
Santhosh Shobhan
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ "కపుల్ ఫ్రెండ్లీ". ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "కపుల్ ఫ్రెండ్లీ" చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.
 
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. "కపుల్ ఫ్రెండ్లీ" టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా "కపుల్ ఫ్రెండ్లీ" ఉండబోతోంది.