శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జులై 2024 (23:03 IST)

పవన్ గెలిచారు.. మరియమ్మకు ఆటోను గిఫ్ట్‌గా ఇచ్చిన బేబీ నిర్మాత

SKN_Mariamma
SKN_Mariamma
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన మెల్లమెల్లగా పీఆర్‌ఓగా ఎదిగి నిర్మాతగా మారారు. బేబీ సక్సెస్‌తో ఆయనకు ఎనలేని పేరు వచ్చింది. కేవలం సినిమాలతోనే కాదు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోనూ ఎస్‌కెఎన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ ఎక్కడికక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటోను బహుమతిగా ఇచ్చాడు.
 
ఏపీలో ఎన్నికల సందర్భంగా మరియమ్మ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపడం ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామం కోసం పార్టీ పెడతానని పేర్కొన్నారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ఎస్కేఎన్ దృష్టిని ఆకర్షించాయి. పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరియమ్మకు ఆటో కొనిస్తానని ఎస్‌కెఎన్‌ సానుకూలంగా స్పందించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎస్‌కెఎన్‌ గురువారం పిఠాపురం వెళ్లి ఆటోను బహుమతిగా ఇచ్చాడు. మరియమ్మకు ఎస్‌కేఎన్‌ కారు ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.