బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (11:41 IST)

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

Andhra Pradesh Deputy CM Pawan Kalyan is a true Indian: SJ Surya
భారతీయుడు 2 చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాదులో జరుగుతోంది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నేహితుడు ఎస్.జె సూర్య మాట్లాడారు. ఆయన ఆడియెన్స్ ను ఉద్దేశించి చెబుతూ... " మీ అందరిలో ఇండియన్స్ వున్నారు. ఇక్కడ నేను మీకో విషయం చెప్పాలి. మనం ఇండియన్ సినిమాలోనే అవినీతిని అంతమొందించే నాయకుడిని చూశాము. కానీ నిజమైన జీవితంలో ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు.
 
నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు. నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని. మీరు నా నమ్మకాన్ని సగం సక్సెస్ చేసారు. మిగిలినది మీ చేతుల్లోనే వుంది" అంటూ చెప్తుండగా ఆడియెన్స్ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేసారు.