బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 జులై 2024 (21:08 IST)

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

Ramcharn helicapter
Ramcharn helicapter
రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు షూటింగ్ కు శుభం కార్డ్ పడింది. నేటితో జరిగిన షూటింగ్ తో గుమ్మడి కొట్టేశారు. ఈ విషయం తెలిసిన చరణ్ వీరాభిమానులు నేటితో ధరిద్రం పోయింది అంటూ సరికొత్తగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఇదిలా వుండగా, నేడు గేమ్ ఛేంజర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లోని ఇక్రిశాట్ లో సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చరణ్ హెలికాప్టర్ వచ్చి దిగిన సన్నివేశాలు, ఇతర నటీనటులతో కలిసిన కాంబినేషన్ సీన్స్ చిత్రించారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్,  నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌,  రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ, వివేక్‌