నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ నగరంలో ప్రముఖ ముఖ ఆస్పత్రి నిమ్స్‌లో అనెస్తీషియాగా పని చేసే వైద్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని అనెస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ పాచీకర్‌గా గుర్తించారు. తనకు తానుగా మోతాదుకు మించి మత్తు శరీరంలోకి ఎక్కించుకోవడంతో ఇచ్చుకోవడం ద్వారా ఆయన అపస్మారకస్థితిలోకి జారుకున్నారు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యుు ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీన చేసుకున్నారు.