సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (11:19 IST)

మారిపోతున్న పిఠాపురం రూపురేఖలు.... బస్టాండుకు కొత్త హంగులు (Video)

pithapuram bustand
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నాలుగు కీలకమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేప్టటారు. పైగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేసమయంలో పిఠాపురం అభివృద్ధిపై ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. పిఠాపురాన్ని ఏపీకి ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఓ కార్యాచరణ రూపొందించి, దాన్ని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, పిఠాపురం బస్టాండు వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే రోజులు పోయాయి. బస్టాండులో మద్యంబాబులు, గంజాయి తాగావేరు తిష్టవేసి అటుగా వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేసేవారు. 
 
ఇపుడు బస్టాండు పరిసరాలను శుభ్రం చేశారు. ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బస్టాండు రూపు రేఖలు మారిపోతున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు వినియోగించుకునేలా బస్టాండును అందంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండుకు మరమ్మతు చేస్తున్నారు. అలాగే, బస్టాండు ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా పూర్తికాకముందే పవన్ కళ్యాణ్ తన నియోజవర్గంపై దృష్టిసారించడం ఇపుడు పిఠాపురం వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి...