ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 జులై 2024 (13:21 IST)

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

Gabbarsingh Sai, Posani, Sri Reddy
సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణమైన పదజాలం ఉపయోగించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైంట్ చేయబోతున్నట్లు గబ్బర్ సింగ్ సాయి అన్నారు. 
 
పవన్ కల్యాణ్ గారు ఎవరినైనా ఒక్క మాట వ్యక్తిగతంగా విమర్శించినట్లు చూసారా? అంటూ ప్రశ్నించారాయన. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ పైన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తను ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైట్ చేయబోతున్నట్లు వివరించారు.