శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:04 IST)

పవన్‌ దృష్టికి రాజ్ తరుణ్ వ్యవహారం.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా?

Raj Tarun's Ex-Lover Lavanya
హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్ ప్రేమించి, సహజీవనం చేసి, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఆధారాలను కూడా పోలీసులకు అందజేసింది. 
 
ఇందులో భాగంగా లావణ్య కేసులో రాజ్ తరణ్ ఎ1గా, మాల్వీ మల్హోత్రా ఎ2గా, మాల్వీ మయాంక్ ఎ3గా చేర్చారు. ఈ కేసును పక్కన బెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య ఆసక్తికర కామెంట్లు చేసింది. దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ తనను ప్రేమించి నమ్మించి మోసం చేశాడనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 
 
పవన్‌కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ.. వాళ్లను పవన్ గౌరవంగా.. బాధ్యతగా చూసుకుంటున్నారని చెప్పారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు తనకు, పిల్లలకు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది.