మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (19:07 IST)

రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు... అది ఆయన పర్సనల్ : మాల్వీ మల్హోత్రా

malvi malhotra
హీరో రాజ్ తరుణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అన్నారు. తాను రాజ్‌ తరుణ్‌తో కలిసి నటించానని, అంతేకానీ, ఆయన వ్యక్తగత జీవితం గురించి తెలుసుకోలేదని వ్యాఖ్యానించారు. "తిరగబడర సామీ" అనే చిత్రంలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ కాగా, రాజ్ తరుణ్ హీరో. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్‌పై పదేళ్లపాటు సహజీవనం చేస్తూ వచ్చిన నటి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్వీ మల్హోత్రా పరిచయమైన తర్వాత రాజ్ తరుణ్ తనను పక్కనపెట్టేశాడని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ అంశంపై బాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్రా స్పందిస్తూ, రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. అది ఆయన పర్సనల్ అని చెప్పారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదన్నారు. సినిమా ప్రచారంలో భాగంగానే రాజ్ తరుణ్‌తో కలిసి తిరిగానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి రాజ్ తరుణ్ గతంలో ఎపుడూ తనతో మాట్లాడలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు తనపై వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విమర్శలను స్వీకరిస్తానని, కానీ, ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోనని చెప్పారు.
malvi malhotra
 
ప్రస్తుతానికి తాను సింగిల్ అని... ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందన్నారు. సినిమానే తన ఫస్ట్ అని చెప్పారు. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని, అందుకే సినిమా గురించే మాట్లాడలనుకున్నట్టు మాల్వీ మల్హోత్రా చెప్పారు.