శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (14:39 IST)

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

Raj tarun, Malvi Malhotra
లావణ్య నాపై చేసిన ఆరోపణలేవీ అవాస్తవం. రాజ్ తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు, స్నేహం తప్ప మా మధ్య ఎలాంటి సంబంధం లేదని.. అతనితో పాటు రాబోయే "తిరగబడరా సామి" చిత్రంలో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. 
 
ఇంకా రాజ్ తరుణ్‌తో తనకు సంబంధం అంటగట్టిన లావణ్యపై ఫిర్యాదు చేసేందుకు మాల్వి హైదరాబాద్‌లోని డీసీపీని కలిశారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్న తన కుటుంబాన్ని లావణ్య బెదిరించిందని, తన సోదరుడికి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని మాల్వీ మల్హోత్రా పేర్కొంది. 
 
లావణ్య ఎవరో, ఆమె ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని నటి ధృవీకరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాల్వీ మల్హోత్రా తెలిపారు.