ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (16:18 IST)

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

rohini
ప్రముఖ యాంకర్ నటి రోహిణికి సంబంధించిన రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం రేపుతోంది. బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న కారణంగా ఆమె అరెస్టు చేయబడి, కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. 
 
ఈ సంఘటనను మరవకముందే.. యాంకర్ రోహిణి పేరు వినబడుతోంది. జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ ప్రోగ్రామ్‌లలో కనిపించే ఈమె వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రోహిణిని రేవ్ పార్టీలో చూపుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
హేమ రేవ్ పార్టీ వీడియోను పోలినట్టుగా ఈ వీడియో వుంది. ఇది నిజమైన రేవ్ పార్టీ వీడియో కాదు ఏదో ప్రమోషనల్ వీడియోలా కనిపిస్తోంది. ఏదో సినిమాకు రోహిణి ప్రమోషన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇది బర్త్ డే బాయ్ సినిమా ప్రమోషన్స్ అనే వాదన కూడా వినిపిస్తోంది.