గురువారం, 6 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 నవంబరు 2025 (08:10 IST)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థాన్ చైర్మనుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీ.ఆర్ నాయుడు మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తిరుమలలో భక్తులకు స్వామివారిని సత్వర దర్శనం అయ్యేందుకు ఏఐ సౌకర్యాన్ని వినియోగించి చేస్తున్నట్లు చెప్పారు. 2 గంటల లోనే స్వామివారి దర్శనం జరిగేట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
తిరుమలలో వసతి గృహాల సంఖ్యను పెంచాలన్న డిమాండుపై ఆయన స్పందిస్తూ... తిరుమలలో అదనంగా వసతి గృహాలను నిర్మించే అవకాశం లేదన్నారు. అందుకే దిగువ తిరుపతిలోనే 50 ఎకరాలు భక్తుల వసతి కోసం చూసామన్నారు. ఆ భూమిలో వసతి గృహాల నిర్మాణం చేపడతామనీ, అక్కడ నుంచి ప్రతిరోజూ 25 వేల మంది భక్తులను బస్సుల్లో తీసుకుని వెళ్లి దర్శనం చేయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తిరుమలలో 1500 వాణిజ్య దుకాణాలను అక్రమంగా కేటాయించారనీ, వాటిని తొలగించాల్సిందిగా రెవిన్యూ శాఖకు చెప్పినట్లు వెల్లడించారు.