కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు
ఓం, కేజీఎఫ్ వంటి చిత్రాలలో మంచి పేరు కొట్టేసిన కన్నడ నటుడు హరీష్ రాయ్ క్యాన్సర్‌తో పోరాడి మరణించారు. ఈ నటుడు దక్షిణ భారత సినిమాల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా కన్నడ, తమిళం, తెలుగు చిత్రాలలో నటించారు.
తన కెరీర్ మొత్తంలో, సమరా, బెంగళూరు అండర్ వరల్డ్, జోడిహక్కి, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర, నల్ల వంటి అనేక చిత్రాలలో నటించారు. అయితే, ఓం, కేజీఎఫ్ ద్వారా అతనికి గుర్తింపు, అభిమానులను సంపాదించిపెట్టింది.
క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్ చికిత్స కోసం రూ.70లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయాలని ఆగస్టులో మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచిన సాయం చేశారు.