సంబంధిత వార్తలు
- సెలవు తీసుకునే హక్కు విరాట్ కోహ్లీకి వుంది... జై షా
- ఊరు పేరు భైరవకోన సినిమాపై కోర్టులో కేసు- విడుదల అయ్యేనా !
- అమెరికా లో వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి !
- క్యాంప్ ఆఫీస్ క్లర్క్... సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు... రెండు చోట్ల ఓటు హక్కు...
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తొలి ఎడ్యుకేషన్ టాబ్లెట్
"సీలావతి"గా వస్తోన్న అనుష్క.. అంతా క్రిష్ మాయ
దర్శకుడు క్రిష్ తెలివిగా తన రాబోయే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి "సీలావతి" అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెట్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మాణంలో ఉంది.
ప్రముఖ దర్శకుడు క్రిష్ ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీర మల్లు" లేటు కావడంతో గ్యాప్‌లో అనుష్కతో సినిమా ప్లాన్ చేసేశాడు. ఇక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో "సీలావతి" సినిమా భావోద్వేగంతో కూడిన డ్రామా అంటూ తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. క్రిష్ "సీలావతి"ని ముగించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ చేస్తాడని తెలుస్తోంది.
తర్వాతి కథనం
