ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:48 IST)

అమెరికా లో వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి !

megastar chiranjeevi, Surekha
megastar chiranjeevi, Surekha
మెగాస్టార్ చిరంజీవి వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారా? అనే టాక్ ఫిలింనగర్ లో నెలకొంది. దీనికంతటికి కారణం. చిరంజీవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. విమానంలో భార్య సురేఖ తో అమెరికా వెళుతున్నట్లు పోస్ట్ చేశారు. నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక చిన్న సెలవు కోసం USAకి బయలుదేరాను. నేను తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర చిత్రీకరణను పునఃప్రారంభిస్తాను. మీ అందరినీ త్వరలో కలుద్దాం. మరియు అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
 
విశ్వంభర చిత్రం ఇటీవలే  మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్ లోనే చిరంజీవిపై పాట చిత్రీకరించారు.  ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు తీశారు. ప్రస్తుతం షూట్ గ్యాప్ తీసుకుంది. దర్శకుడు వశిష్ట ఇతర సన్నివేశాలతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలోని పాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి ఇప్పటికే బాణీలు వినిపించారు. కాగా, ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి నిర్మస్తున్నారు.