శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (12:23 IST)

తిరగబడరసామీ లో రోమాన్స్ తో అలరించే దిశగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా

Raj Tarun, Malvi Malhotra
Raj Tarun, Malvi Malhotra
రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
ఈ చిత్రం సింహభాగం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్లో సరికొత్త  లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకొని, షూటింగ్ ని పూర్తి చేసుకుంది. యువతని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ బిగ్ బాస్ తో యావత్ భారతాన్ని అలరిస్తున్న మనరా చోప్రా ఈ చిత్రంలో ఓ విభన్న పాత్రతో పాటు ప్రత్యేక గీతంతో అలరించబోతుంది.
 
ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువతని ఉర్రూతలూగించే పాటలు, అద్భుతమైన నేపధ్య సంగీతం అందిస్తున్నారు సంగీత దర్శకుడు జేబీ. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.