ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (16:14 IST)

1980 బ్యాక్ డ్రాప్ లో రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా మాస్ మహారాజు

Raj Tarun, Sandeep Madhav, Mas Maharaj,Satna Titus, Sampada
Raj Tarun, Sandeep Madhav, Mas Maharaj,Satna Titus, Sampada
సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతి రాజు నిర్మిస్తున్న సినిమా మాస్ మహారాజు. రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న మాస్ మహారాజు సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యుల్ జరుపుకుంటుంది. 
 
గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, సంపద హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.