నా సామిరంగ కోసం నాగార్జున అక్కినేనితో స్నేహితులుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్
Allari Naresh - Raj Tarun - Nagarjuna Akkinen
నాగార్జున అక్కినేని మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నా సామిరంగ'తో 2024 సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్- టైమర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ తో పాటు ఫ్రెండ్షిప్ కూడా కోర్ ఎలిమెంట్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన నటీనటులను పరిచయం చేసి, మొదటి సింగిల్‌ని విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
ఇటీవల విడుదలైన గ్లింప్స్ నాగార్జున, అల్లరి నరేష్‌ల స్నేహాన్ని ఎలివేట్ చేయగా, టీజర్ సినిమాలోని అన్ని ఇతర లేయర్స్ ని పరిచయం చేసింది. నాగార్జున గురించి ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. కింగ్ నాగార్జున మామిడి తోట ఫైట్ యాక్షన్ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్, ఆషికా పదేళ్లుగా మాట్లాడుకోరు. కానీ కళ్లతో కమ్యునికేట్ చేసుకుంటారు. యంగ్ ఏజ్ లో వీరిద్దరి ప్రేమ, నాగ్ తన స్నేహితులైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్ లో ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా టీజర్ చివరి సగం మాస్ స్టఫ్, యాక్షన్స్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెచ్చింది.
అన్ని కోణాలను అద్భుతంగా ప్రజెంట్ చేసిన టీజర్.. ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్‌ని ప్రామిస్ చేస్తోంది. ప్రతి సీక్వెన్స్ ని విజయ్ బిన్నీ ఎక్స్ ట్రార్డినరీగా తీర్చిదిద్దారు. రొమాన్స్, స్నేహం, యాక్షన్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. నాగార్జున తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించారు. నాగార్జున గోదావరి యాస చాలా బాగుంది. ఆషికతో అతని కెమిస్ట్రీ అలరించింది. నాగ్, నరేష్, రాజ్ తరుణ్ స్నేహం మరొక ప్రధాన ఆకర్షణ.
శివేంద్ర దాశరధి ఫ్రేమ్‌లను అద్భుతంగా చూపించారు. ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన స్కోర్‌తో డిఫరెంట్ మూడ్‌లను సెట్ చేసారు. నాగ్ ఇంట్రోకి ట్రెండీ, జాజీ మ్యూజిక్ పాత్రను మరింత అద్భుతంగా మలిచింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. టీజర్ ప్రామెసింగ్ గా వుంది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ పై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.
చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, సంభాషణలు రాశారు.
'నా సామిరంగ' 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.
తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరుణ కుమార్