సంబంధిత వార్తలు
- ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా :: నాగార్జున - ఆషికా రంగనాథ్ రొమాన్స్
- నా సామి రంగ ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అనౌన్స్ మెంట్
- నాగార్జున చిత్రం నా సామి రంగలో ఆషికా రంగనాథ్ పరిచయం
- అల్లరి నరేష్ కథానాయకుడు గా బచ్చల మల్లి ప్రారంభమైంది
- ఈవీవీ సత్యనారాయణ గదికి రమ్మన్నారు.. అడ్జెస్ట్ కావాలన్నారు.. షకీలా
నాగార్జున అక్కినేని నా సామిరంగలో అంజిగా అల్లరి నరేష్
Nagarjuna- naresh
అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు,అంజి పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు. మాటొచ్చేత్తది అనేది తను తరుచుగా వాడే మాటే. ఇది మాటమీద నిలబడే వ్యక్తిగా అతని పాత్రను సూచిస్తుంది.
నాగార్జున, అల్లరి నరేష్‌లను కలిసి చూడటం కనుల పండువగా ఉంటుంది. అల్లరి నరేష్ సినిమాకు పెద్ద వాల్యూ అడిషన్. శివేంద్ర దాశరధి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించగా, ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన సంగీతంతో విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టీజర్‌ను త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఆషికా రంగానంద్ ఈ చిత్రంలో కథానాయిక. లీడ్ పెయిర్‌లో వచ్చిన ఫస్ట్ సింగిల్- ఎత్తుకెల్లిపోవాలనిపిస్తుంది పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
నా సామిరంగ 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.
