ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (19:24 IST)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

siva kumar, Raj Tarun, Malvi Malhotra, ravikumar
siva kumar, Raj Tarun, Malvi Malhotra, ravikumar
రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
 
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ హైలెట్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ యాక్షన్ మునుపెన్నుడూ కనిపించని యాక్షన్ అవతార్ లో అదరగొట్టారు. తన ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ హైలీ ఎనర్జిటిక్ గా వుంది.  హీరోయిన్  మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి.
 
డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి యాక్షన్, ఎమోషన్ ని ఎక్స్ ట్రార్డినరీ గా బ్లెండ్ చేశారు. ఆయన టేకింగ్ బ్రిలియంట్ గా వుంది. రాజ్ తరుణ్ ని యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో చాలా కొత్తగా చూపించారు. కెమరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. హై యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ తో అదరగొట్టిన ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అందరం ప్రాణం పెట్టి చేశాం. మా అందరికి కంటే ఎక్కువ కష్టపడింది డీవోపీ జవహర్ రెడ్డి గారు. ఆయన లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన నిర్మాత శివ గారికి థాంక్ యూ. జెబి గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. మాల్వి వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నాపై ఒక్కసారి కూడా కొప్పడలేదు. (నవ్వుతూ). ఇంత యాక్షన్ పార్ట్ చేయడం నాకు కొత్త. డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈజీగా చేశాను. ఇందులో ఎమోషన్ , ఎంటర్ టైన్మెంట్ అద్భుతంగా వుంటుంది.  ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. 'తిరగబడరసామీ' త్వరలోనే థియేటర్స్ లో వస్తుంది. దయచేసి అందరూ థియేటర్స్ లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు' అన్నారు.
 
డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ గా వుంది. 2004 ఇదే రోజున యజ్ఞం విడుదలై నా జీవితాన్ని మలుపు తిప్పింది, అదే రోజున ఈ ట్రైలర్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో. ఈ సినిమా తర్వాత తను మాస్ హీరోగా నిలబడతాడు. డీవోపీ జోహార్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జేబీ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. శివకుమార్ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది' అన్నారు.
 
మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా బ్యూటీఫుల్ కథ. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఇందులో బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తా. నాకు యాక్షన్ సీన్ కూడా వుంది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది. తను అద్భుతమైన యాక్టర్. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.  
 
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారు కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. రాజ్ తరుణ్ అయితే బావుటుందని వారు ఒప్పుకోగానే సినిమాని స్టార్ట్ చేశాం, జెబి అద్భుతంగా నేపధ్య సంగీతం చేశారు. జవహర్ రెడ్డి గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. నేను ప్రతి సినిమాలో కొత్తవారిని పరిచయం చేస్తుంటాను. మాల్వి ఈ సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ అవుతున్నారు. ఈ పాత్రని చాలా చక్కగా చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులకు అందిఇవ్వాలని టీం అంతా సమిష్టి కృషితో పని చేశాం. రాజ్ తరుణ్  యాక్షన్ పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు. సైలెంట్ గా మొదలై వైలెంట్ ముగింపు వుంటుంది. ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇది మా బ్యానర్ లో రికార్డ్ లో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి