బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:52 IST)

ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద... జ‌గ‌న్ కుటుంబం అంతా క‌లిసి నివాళి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్ కుటుంబ స‌భ్యులంతా క‌లిసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ షర్మిల, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
 
డిప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజాద్‌ బాషా, నారాయణ స్వామి, ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.