శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:50 IST)

నేడు సొంత జిల్లా కడపకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు.
 
సెప్టెంబరు రెండో తేదీ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉ.9.35 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.