1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-09-2021 బుధవారం దినఫలాలు - గాయిత్రీ మాతను ఆరాధించిన జయం

మేషం : ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన చర్చలు సజావుగా సాగుతాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృషభం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. పచారీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. 
 
మిథునం : ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం. మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. తలపెట్టిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. లౌక్యంగా మెలిగి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. 
 
కర్కాటకం : స్టేషనరీ, ప్రింటింగ్, రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. బంధువుల నుంచి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
సింహం : ఆర్థిక లావాదీవీలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. మీ ఉన్నతిని ఎదుటివారు గుర్తిస్తారు. 
 
కన్య : దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు ఏ విషయం పట్ల ఆసక్తి అంతగా ఉండదు. నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల హితోపదేశం మీపై మంచి ప్రభావం చూపుతుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వంటి చికాకులు తప్పవు. 
 
తుల : ఉపాధ్యాయులకు సంఘంలో మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు ప్రణమాళికా బద్ధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు తమ క్లయింట్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు. 
 
వృశ్చికం : మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసం. విద్యార్థినులకో లక్ష్యం పట్ల ఏకాగ్రత, పాఠ్యాంశాల పట్ల అవగాహన పెంపొందుతాయి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. 
 
ధనస్సు : వైద్య రంగాల వారికి ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత, ఓర్పు ఎంతో ముఖ్యం. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. సాహసించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. 
 
మకరం : ఆర్థికంగా ఎదగడానికి చేయు యత్నాలు ఫలించవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఎదురుచూస్తున్న నోటీసులు, రశీదులు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. విద్యార్థులు క్రీడలు, క్రీడ్ పోటీల్లో రాణిస్తారు. 
 
కుంభం : కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రాజకీయ నాయకులు, తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మీనం : తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. హమీలు, మధ్యవర్తిత్వాలు చికాకు పరుస్తాయి. ధన సహాయం, చెల్లింపుల్లో అప్రమత్తత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.