శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-08-2021 శనివారం దినఫలాలు - నవగ్రహ పారాయణం...

మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎందుర్కొంటారు. 
 
వృషభం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. దైవ, శుభ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. 
 
మిథునం : మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తేగానీ పనులు నెరవేరవు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాపరుస్తాయి. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు స్త్రీలు తమ సరదాలు, కోరికలు వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఒక్కోసారి ధనం ఎంత వ్యయం చేసినా ప్రయోజనం ఉండదు. స్త్రీలు ఆడంబరాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
సింహం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటాబయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. దైవ, పుణ్య కార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూల కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. పాత మిత్రుల కలయిక గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడుతారు. 
 
తుల : బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు వెల్లువిరుస్తాయి. 
 
వృశ్చికం : ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీముల కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. 
 
ధనస్సు : నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. ప్రయాణాలలో మెళకువ అవసరం. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్థలు రావచ్చును. ప్రైవేటు సంస్థల్లో వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవం వల్ల మాటపడక తప్పదు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివస్తుంది. 
 
మకరం : బంధువులరాక ఉత్సాహన్నిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తలెత్తుతాయి. కుటుంబీకుల కోసం ధనం విరిగివా వ్యయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణం వాయిదా వేయవలసి వస్తుంది. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. 
 
కుంభం : అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఐరన్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం : విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పాత సమస్యలు ఛైదించే ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.