గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-08-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను దర్శించిన శుభం

మేషం : వృథా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆరోగ్యభంగం, ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి. గృహ మరమ్మతులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత, మెళకువ ముఖ్యం. 
 
వృషభం : ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. కమీషన్‌దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
మిథునం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్ స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులుపడుట వల్ల మాట పడవలసి వస్తుంది. 
 
కర్కాటకం : చేతి వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్‌చాతుర్యం ఉండును. బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది.
 
సింహం : ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పెట్ల మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. 
 
కన్య : ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. దైవ, పుణ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
తుల : ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. శతృవులపై విజయం సాధిస్తారు. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించ వలసి ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పొట్ట, బీపీ, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : ఓర్పుతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహమునకు వస్తువులను అమర్చుకుంటారు. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. దైవ శుభకార్యం చేయాలనే సంకల్పం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. విద్యార్థినులకు ఒక విషయం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అవివాహితులకు ఒక వార్త ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. 
 
మకరం : విదేశీయత్నాలు శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వార కోరుకునే మార్పులు త్వరలోనే అనుకూలించగలవు. ప్లీడర్లకు తమ క్లయింట్లల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. 
 
కుంభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. దూర ప్రయాణాలలో ఊహించని ధననష్టం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. 
 
మీనం : ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. బంధు మిత్రులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. రుణం తీర్చడానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ప్రేమ వ్యవహారాల పట్ల కనపర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు.