గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-08-2021- బుధవారం మీ రాశి ఫలితాలు.. అమ్మవారిని..?

అమ్మవారిని సువర్ణగన్నేరు పూలతో ఆరాధించినట్లైతే శుభం కలుగుతుంది.
 
మేషం: ఉద్యోగస్తులకు శుభదాయకం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. ప్రయాణాలు అనుకూలించవు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
వృషభం: ఉద్యోగస్తులు అధిక శ్రమ పడినప్పటికీ తగిన గుర్తింపు వుండదు. చిన్న తరహా, కుటీర పరిశ్రమల వారికి ఆశాజనకం. ఇచ్చిపుచ్చుకున వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్య యత్నంగా అడుగులు వేస్తారు. రాబడికి తగిన ఖర్చులుంటాయి. వాతావరణంలో మార్పు వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మానసిక సంతృప్తి, ప్రశాంతత. దీర్ఘకాలిక రుణయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు, ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. వృత్తి వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. విద్యార్థులు అధిక ఒత్తిడి, శ్రమను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి వుంటుంది. విద్యా సంస్థల్లో వారికి ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. 
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థవంతంగా నడిపిస్తారు. వాతావరణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. దైవ దర్శనాల వల్ల మానసిక సంతృప్తి, ఆనందం చోటుచేసుకుంటాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కన్య: ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా వుండదు. తీర్థయాత్రలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం చురుకుగా సాగవు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, ఓర్పు అవసరం. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆకస్మికంగా ప్రయాణం తలపెడతారు.
 
తుల: ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా వుండటం మంచిది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.
 
వృశ్చికం: ధనం ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించం మంచిది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి పురోభివృద్ధి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ముఖ్య విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. 
 
మకరం: బంధుమిత్రుల రాకతో గృహం కళకళలాడుతుంది. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నూతన వెంచర్లు కలిసిరాగలవు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. 
 
కుంభం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వారి కార్యకలాపాలు సాఫీగా సాగిపోతాయి. నూతన పెట్టుబడులకు కొంత అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాల్లో వారు ప్రతిపక్షాల పట్ల ఓర్పు నేర్పుతో వ్యవహరించాలి. చక్కని ప్రణాళికలతో విజయాన్ని సాధిస్తారు.
 
మీనం: ఊహించని ఖర్చులెదురవడంతో మీ చేతిలో ధనం నిలువదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయంలోనూ తొందరవద్దు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. దూర ప్రయాణాలకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బజారు తినుబండారాలు భుజించం వల్ల అస్వస్థతకు గురవుతారు.