మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-08-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రనిపూలతో ఆరాధించినా..

మేషం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం : రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుంటారు. 
 
మిథునం : దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం చేతికందక పోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికీ సహాయం చేసి మాటపడతారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్టుగానే ఉంటాయి. 
 
సింహం : రవాణా రంగాలలో వారికి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది. నిరుద్యోగులు, నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఏదన్న అమ్మకానికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. బంధువుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
కన్య : ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త పథకాలు వేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనచోదకులకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. 
 
తుల : సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. రచయితలకు, పత్రికా రంగంల వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. మొండి బాకీలు సైత వసూలు కాగలవు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారంవుంది. 
 
వృశ్చికం : ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగడం మంచిదని గమనించండి. ఔదార్యమున్న స్నేహితులు, మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. మీరంటే అసూయపడే ఒకరి ద్వారా అనవసర చిక్కుల్లో పడవచ్చు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు సొంతం చేసుకుంటారు. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం. 
 
మకరం : కొంతమంది మీ నుంచి ధనం లేదా ఇతరత్రా  సహాయం అర్థిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. చెడు స్నేహాలు వదలడం వల్ల అభివృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. 
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. బ్యాంకింగ్ వ్యవహారాలు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. హోటల్, తినుబండ క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మీనం : కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. పారిశ్రామిక రంగంలోని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.