1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-08-2021 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడిని పూజించినా...

మేషం : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. 
 
వృషభం : వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. 
 
మిథునం : ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరాత్రా వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. మీ శ్రీమతికి ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సంకల్ప బలంతో మీ యత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు పనిభారం అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సంతానానికి దూర ప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 
 
సింహం : ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఇబ్బందులెదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
కన్య : కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరాత్రా సాయం అర్థిస్తారు. చేపట్టిన పనులలలో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషింస్తారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
తుల : ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగులతో సౌమ్యంగా మెలగవలసి ఉంటుంది. కొంతమంది మిమ్మలను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. ప్రతి విషయంలోనూ  శాంతంగా వ్యవహరించాలి. స్త్రీలకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, ధననష్టం వంటి చికాకులు తప్పవు. 
 
వృశ్చికం : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలు ఉంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. అన్ని వ్యవహారాల్లో జయం లభిస్తుంది. స్త్రీలు, దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం, పెరుగుతాయి. 
 
ధనస్సు : చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారిక ఆశాజనకం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
మకరం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
కుంభం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిరు వ్యపారులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం వుంది. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
మీనం : మొండిబాకీలు వసూలు కాగలవు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు.