గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (09:57 IST)

16-08-2021 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా...

మేషం : ఉద్యోగులకు స్థానచలన యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకులకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. 
 
వృషభం : ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారుల్లో పోటీతత్వం పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తు సామాగ్రి అందజేస్తారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. 
 
మిథునం : ఆదాయం పెరిగి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఆలయ సందర్శనాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. నిరుద్యోగులు సదావకాశాలను జారవిడుచుకుంటారు. 
 
కర్కాటకం : బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని ఫలితం దక్కుతుంది. ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. 
 
సింహం : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు అని గమనించండి. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. 
 
తుల : ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులవల్ల మాటపడతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తిని ఇవ్వవు. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆదాయ వ్యయాల్లో ప్రమాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా అధిక ధనవయ్యం చేస్తారు. 
 
ధనస్సు : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. మీ దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొదుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు. 
 
మకరం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలు, టీవీ చానల్స్ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. 
 
కుంభం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
మీనం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. వస్త్ర, బంగారు, విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.