మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-08-2021 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించినా...

మేషం : వ్యాపార రీత్యా దూర ప్రయాణ చేయవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. 
 
వృషభం : స్త్రీలకు స్వీయ అర్చన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కపటం లేని ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాధించి పెడుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ప్రతికూలతలు ఎదురవుతాయి. 
 
మిథునం : సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. స్త్రీలు గృహోపకరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన లేఖలు అందుతాయి. ఫ్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. విద్యార్థులకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖ సంస్థలతో సంయుక్తంగా కొత్త సంస్థల స్థాపనకు యత్నాలు సాగిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. 
 
సింహం : ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీయత్నం నెరవేరదు. ఓర్పు, వ్యవహార దక్షతతో కొన్ని సమస్యలు అధికమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలు మార్లు తిరగవలసి వస్తుంది.
 
కన్య : రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని అభిమానించే ఆత్మీయులను బాధపెట్టడం మంచిదికాదని గమనించండి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ఉత్పత్తులకు తగిన ఆర్థిక సహాయం, అనుమతులు మంజూరు అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
తుల : శత్రువులపై విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకువేయండి. 
 
వృశ్చికం : ఉపాధ్యాయ రంగంలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. రావలసిన ఆదాయం అనుకోకుండా వసూలు కావడం, రుణవిముక్తి, తాకట్టు విడిపించుకోవడం వంటి శుభఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
ధనస్సు : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వాతావరణంలో మార్పువల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
మకరం : ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త ఫథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ సరదాల కోరికలు వాయిదావేసుకోవలసి వస్తుంది. కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలు ఉన్నాయి. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. 
 
కుంభం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తిప్పట తప్పదు. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి బహుమతులు, అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వ అధికారులతో సమస్యలు తలెత్తగలవు. అనవసర వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తినా సమసిపోగలవు. 
 
మీనం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. మీ శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం.