శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-08-2021 సోమవారం దినఫలాలు - లక్ష్మీనారాయణుడి పూజిస్తే మనోసిద్ధి...

మేషం : వ్యవసాయ రంగాల వారికి మెళకువ అవసరం. చేపట్టిన పనులపట్ల ఆసక్తి ఉండదు. స్త్రీలను గృహంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 
 
వృషభం : బ్యాంకింగ్ ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారు నుంచి ఒత్తిడి, చికాకులను అధికమవుతాయి. ప్రేమికులకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మిథునం : దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ప్రయాలెదుర్కొంటారు. స్త్రీలకు స్వల్ప అస్వస్థతకు గురవుతారు. బంధువుల రాకతో రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల మధ్య ఆసక్తిరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు హోదా పెరగడంతోపాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. మిత్రులతో వచ్చిన మార్పు, నిరుత్సాహం కలిగిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
కన్య : వృత్తి ఉద్యోగములందు ఆదాయం బాగుంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ వారికి పార్టీపరంగాను అన్ని విధాలా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. 
 
తుల : గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం చేతికందకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్టుగానే ఉంటాయి. వ్యాపారాభివృద్ధికే చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు : విద్యార్థులు స్వయంకృషితో బాగా రాణిస్తారు. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రేమికులకు అనుమానాలు మరింత బలపడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. 
 
మకరం : బంధువుల మధ్య ప్రేమానుబంధాలు బలపపడతాయి. రవాణా రంగాలలో వారి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదాపడతాయి. రచయితలకు పత్రికా రంగంలో వారికి కీర్తి గౌరవాలు పెరుగుతాయి. 
 
కుంభం : రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. పారిశ్రామిక రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. లౌక్యంగా వ్యవహించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికి సహాయం చేసి మాటపడతారు.