సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-08-2021 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించినా...

మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. అధిక ఉష్ణం వల్ల కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాగ్ధానాలు నిలుపుకోకపోవడం వల్ల రాజకీయాలలో వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
వృషభం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు జయం చేకూరగలదు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కార్మికులకు విశ్రాంతి లోపం వల్ల చికాకులు తప్పవు. 
 
మిథునం : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమాత్రం ఫలితం ఉండదు. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఏదైనా పరిశ్రమలు, సంస్థలు స్థాపించాలనుకునే మీ ఆశయం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. 
 
కర్కాటకం : గృహమునకు కావాల్సిన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు హడావుడి తొందరపాటుతగదు. కీలకమైన సమావేశాల్లో మితంగానే సంభాషించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలిస్తాయి. 
 
సింహం : చేయదలుచుకున్న మంచి పని వాయిదా వేయకండి. మీ సంతానం కోసం ఫీజులు బిల్లులు చెల్లిస్తారు. బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. 
 
కన్య : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. 
 
తుల : కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే మీ ఆలోచనలుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృశ్చికం : స్త్రీలు, టీవీ చానెళ్ల కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించాల్సి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. ఫ్లీడర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మందులు విత్తనాలు, రసాయన వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. వాహన చోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మకరం : గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులంతగా ఉండవు. ప్రముఖుల సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎదుటివారు ఉద్రేకపరిచినా శాంతం వహించండి. 
 
కుంభం : పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సృజనాత్మకతతో మీరు కోరుకున్న రంగంలో ప్రవేశించేందుకు ఇది ఉత్తమమైన సమయం. 
 
మీనం : రాజకీయ నాయకులు సభు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు రాత మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.