శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:37 IST)

మిడిల్ క్లాస్ ఆడియన్స్‌ వస్తేనే కలెక్షన్లు : 3న ఓటీటీలో పాగల్ .. నిర్మాత

మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్‌కు వస్తేనే సినిమాకు కలెక్షన్లు వస్తాయని పాగల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తెలిపారు. విశ్వక్ చేస్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర కియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'పాగల్'. ఈ చిత్రాన్ని ఈ నెల 3వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనన్నారు. 
 
ఇదే అంశంపై నిర్మాత బెక్కం వెణుగోపాల్ మాట్లాడుతూ, 'చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా ‘పాగల్’ సినిమాను విడుదల చేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను చక్కగా ఆదరించడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నట్టు చెప్పారు.
 
ఇకపోతే, ఈ నెల 3వ తేదీన ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. శాటిలైట్ హక్కులను విక్రయించినట్టు చెప్పారు. ఇక మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తేనే భారీ కలెక్షన్స్ ఉంటాయి. 
 
వాళ్లు లేకపోతే కలెక్షన్స్ అనుకున్నంతగా ఉండవు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా పోలీస్ ఆఫీసర్ బయోపిక్ తరహాలో ఓ సినిమాను చేస్తున్నాం. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని వివరించారు.